రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళతారనేది పెద్ద సస్పెన్సుగానే ఉంటుంది. ఇప్పుడు రాజకీయవర్గాలలో ఒక వార్త సంచలనం రేపుతోంది. టీడీపీ అధికారం కోల్పోయిన తరవాత కొంత మంది టీడీపీ నాయకులు వివిధ పార్టీలలో చేరిన విషయం తెలిసిందే.ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారాలనే ఉద్దెశంలో ఉన్నారు. ఆయన కొంత కాలంగా పార్టీ మార్పుపై తన అనుచరులతో చర్చిస్తున్నారు. కాగా మొన్న జరిగిన జనరల్ ఎన్నికలలో గంటా.. విశాఖపట్నం నార్త్ నియోజికవర్గం నుండి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచినా విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా గంటా.. వైసీపీలో చేరుతారనే టాక్ వినపడుతుంది. దీనికి తోడు గంటా అనుచరవర్గం కూడా వైసీపీలోకి చేరబోతున్నారని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు మొదట బీజేపీలోకి చేరాలని చూసినా.. తాజా పరిణామాల దృష్ట్యా వైసీపీలోకి అయితే బెస్ట్ అనే అభిప్రాయంలోకి వచ్చారట. కావున ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.


Tags: tdp, ycp


  •  
  •  
  •  
  •  
  •  
  •