సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది వైసీపీలో రోజురోజుకి వలసల జోరు పెరుగుతుంది. ఇప్పటికే టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. లోటస్ పాండ్లో ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గుంటూరు జిల్లాలో వైసీపీ బలపడటానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఓ సైనికుడిలా పని చేస్తానని.. అసలు గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని.. హైదరాబాద్ ని రాష్ట్రానికి దూరం చేసింది చంద్రబాబేనని అన్నారు. కాగా మోదుగులతో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు.