ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పాటు టీడీపీ మాజీ మంత్రి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తుంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తో పాటు మాజీ మంత్రి సిద్దా రాఘవరావు వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలు ఈ నెలాఖరులోపు వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అయితే వీరిద్దరూ గతంలోనే వైసీపీలోకి రావాలని భావించారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో వీరిద్దరి చేరిక వాయిదా వేసుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా నుండి 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో చీరాల నుండి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కొడుకుని వైసీపీలోకి చేర్చి జగన్ కు తన మద్దతు ప్రకటించారు. తాజాగా టీడీపీ నుండి మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడతుండడంతో టీడీపీ కి భారీ షాక్ అని చెప్పవచ్చు. ఇంకా మిగిలింది టీడీపీకి ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ను చంద్రబాబు ఫోన్ లో బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

సీఎం జగన్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. లక్షణాలు లేకుండానే వైరస్ వ్యాప్తి..!