విశాఖ సౌత్ నియోజికవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఆయన పార్టీ కండువా మేడలో వేసుకోలేదు. ఇక వాసుపల్లి గణేష్ ఇద్దరు కుమారులకు మేడలో కండువా వేసిన జగన్.. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ కావడం చాలా ఆనందంగా ఉందని.. అనేక సంక్షేమ పథకాలతో సీఎం.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు.

ఇక టీడీపీ ముందుకు వస్తుందని.. నాకు అనిపించడం లేదని.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అన్నారు. నా నియోజికవర్గంలో అన్ని పనులు సీఎం జగన్ వల్లే సాధ్యం అవుతున్నాయని.. మేయర్ ఎన్నికలలో విజయం సాధించి జగన్ కు గిఫ్ట్ ఇస్తామన్నారు.

‘మహాసముద్రం’ అఫీసియల్ ప్రకటన..!

బిగ్ బాస్ లో కరాటీ కళ్యాణి అభిమానులు పెరిగిపోతున్నారండి