బీజేపీ సభ్యులు చెబుతున్నట్లు అనుకున్న పని త్వరగా ఫినిష్ చేసేలా ఉన్నారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో ఖాళీ చేసి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తామని ఏవైతే మాటలు చెబుతున్నారో అవన్నీ రాబోయే కొద్ది రోజులలో మనం చూడవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరితే ఇప్పుడు టార్గెట్ ఎమ్మెల్యేలు కూడా సక్సె ఫుల్ గా చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేరుగా బీజేపీతో టచ్ లోకి వెళ్లి మంతనాలు చేస్తున్నారు.

అనగాని సత్యప్రసాద్ రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యాడు. ఇతనిని తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పిరాయించిన గరికపాటి మోహనరావు బీజేపీ పెద్దలకు పరిచయం చేసారు. ఇక మరో ఎమ్మెల్యే గన్నవరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండవ సారి ఎన్నికైన వల్లభనేని వంశీ కూడా బీజేపీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వల్లభనేని వంశీ కొంత సైలెంట్ గా ఉంటున్నాడు. ఈరోజు చంద్రబాబు సమావేశానికి కూడా డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉండటంతో డుమ్మా కొట్టాడా లేక, ఏదైనా పని మీద బయట ప్రాంతానికి వెళ్లాడా అనేది వంశీ దగ్గర నుంచి సమాధానం లేదని తెలుస్తుంది. నేరుగా చంద్రబాబు నాయుడు వంశీతో మాట్లాడటానికి ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట. దీనితో రాబోయే వారం రోజులలో చంద్రబాబు నాయుడుకి ప్రజావేదిక కూల్చి వేత కన్నా పెద్ద గండమే తన ముందు ఉన్నట్లు ఈరోజు పరిణామాలతో అర్ధమై ఉంటుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •