చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం, అమరావతిలో తనతో పాటు తన బినామీల భూముల రేట్లు తగ్గకుండా ఉండటానికి అక్కడ కృత్రిమ ధర్నాలు, నిరసనలు చేయిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాడు అందులో భాగంగా ఎట్టి పరిస్థితిలో శాసన సభలో ఆమోదించబడిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులకు సంబంధించి శాసన మండలిలో ఆమోదించబడకుండా చంద్రబాబు నాయుడు శాసన మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మెన్ కు సూచనలు చేస్తూ ఎట్టి పరిస్థితులలో బిల్ ఆమోదించబడకూడదు, రిజెక్ట్ అవ్వకూడదని నేరుగా సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా వ్యూహ రచన చేసాడు.

ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడే అలా తన బెదిరింపులతో అలా చేస్తే అధికార పక్షం ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు సాధించిన జగన్ సర్కార్ ఏఁయినా తగ్గుతుందా, అసలు శాసన సభలో ఆమోదించిన బిల్లులు శాసన మండలిలో పెండింగ్ లో పెట్టడం ఏమిటని కోపంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని ఆలోచించిన దాని ప్రకారం చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్సీలు తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్థకంగా మారుతుందని చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఎమ్మెల్సీలు కొంతమంది ఆగ్రహంతో నీ ఆస్తుల కోసం తమ రాజకీయ భవిష్యత్ నాశనం చేయాలని చూస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తే, మధ్యలో లోకేష్ బాబు అడ్డుకోబోతే లోకేష్ బాబుపై కూడా అరహం వ్యక్తం చేస్తూ మీద మీదకు వెళ్లబోయారట. దీనితో పక్కనున్న కొంతమంది సర్దిచెప్పి గొడవ సర్దుమణిగేలా చేయాలని చూసినా వారు మాత్రం తమకు అనాయ్యం చేస్తే ఊరుకునేది లేదని తమ దారి తాము చూసుకుంటామని ఆగ్రహంగా చెప్పారట.

దయచేసి అలాంటి పని చేయవద్దని చంద్రబాబు అనగా, రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడు కాకపోతే మూడు నెలలు తరువాత అయినా ఆమోదం పొందుతుందని కానీ తాము మాత్రం తమ రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకోలేమని, అమరావతి రాజధాని కోసం నువ్వు, నీ కొడుకు బాగుపడటానికి తమ తమ ప్రాంతాలలో విలన్ లుగా మిగలలేమని తమకు ఏమి చేయాలో తెలుసునని అంటూ ఆగ్రహంగా వెళ్లిపోయినట్లు విజయవాడలో గుసగుసలాడుకుంటున్నారు .

ఒకవైపున ఎమ్మెల్సీలు ఎదురు తిరగడంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు తమకు సీఎం జగన్ అవకాశం ఇస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్న వారికి అందివచ్చిన అవకాశంగా వైసీపీలో తమకు తెలిసిన నేతలతో చర్చలు చేస్తూ తాము కూడా వైసీపీలోకి వస్తామని, లేకపోతే జగన్ అనుమతి ఇస్తే వల్లభనేని వంశీలా తాము ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తామని కోరుతున్నారట. కానీ వచ్చే మూడు రోజులు రాజకీయం అయితే మంచి రంజుగా మరే అవకాశాలు కచ్చితంగా కనపడుతున్నాయి.