తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 40 ఏళ్ళ పార్టీ చరిత్రలో ఎన్నడు లేనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. తాను సీఎం జగన్ చేత కండువా కప్పించుకోక పోయిన ఆతడి కుమారులు ఇద్దరు వైసీపీ పార్టీ కండువా కప్పించుకొని వైసీపీలో తమ ఎంట్రీ లాంఛనం చేసేసుకున్నారు. తాను ఎన్నికలకు కూడా సిద్ధమని, విశాఖలో రాజధాని రావడాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పుకొస్తున్నారు.

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని వీడి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. అతి త్వరలో మరొక నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. విశాఖకు చెందిన మరొక ఎమ్మెల్యేతో పాటు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ఇలా అందరూ చేరడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తుంది. కానీ సీఎం జగన్ మాత్రం ఎవరకి పడితే వారికీ ఎంట్రీ బోర్డు పెట్టకుండా తమకు రాబోయే రోజులలో ఎక్కడైతే అవసరమని భావిస్తారో వారికి మాత్రమే గ్రీన్ లైట్ వేస్తూ స్వాగతం పలుకుతున్నారు. ఇలా ఒకొక్కరుగా పార్టీని వీడుతుండటంతో రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా పోయే అవకాశాలు ఉన్నాయని, దానిని కాపాడుకోవడం సాధ్యమయ్యే పని కాదని టీడీపీ సీనియర్ నేతలే భావిస్తున్నారట.