ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు ఖరారైంది. ఈనెల 27న అచ్చెన్నాయుడి పేరును చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల పక్రియను మండలస్థాయి వరకు పూర్తి చేసిన టీడీపీ.. ఇప్పడు లోక్సభ నియోజికవర్గాల వారీగా కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈలోగానే అచ్చెన్నాయుడిని టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని తెలుస్తుంది.

ఇక ఈఎస్ఐ స్కామ్ కేసులో ఇటీవల అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి వచ్చారు. ఆయన దాదాపు 70 రోజుల పాటు జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే.

మాస్ హీరో మల్టీస్టారర్ సినిమా.. అక్టోబర్ లో సెట్స్ పైకి..!

ట్రోలర్స్ కు ఘాటుగా సమాధానం చెప్పిన సోను సూద్..!

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?