సీఎం జగన్ నిన్న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విద్యాకానుకపై తెలుగుదేశం నేతలకు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక గింజుకుంటున్నారు. ఏదైనా పధకం మొదలుపెట్టినప్పుడు దానిలో నాణ్యతపై కచ్చితంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. జగన్ సర్కార్ నిన్న ప్రవేశ పెట్టిన పధకంలో ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ఏమాత్రం తీసిపోని నాణ్యతతో విద్యార్థులకు డ్రెస్, బూట్లు, బ్యాగ్ పుస్తకాలు ఇలా అనేకమైనవి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఇవ్వనున్నారు.

బేసిక్ గా వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందే ఇలాంటి పథకాలలో నాణ్యత కాస్త తగ్గించి డబ్బులను జేబులో వేసుకోవడం అన్ని ప్రభుత్వాలు చేసే పని. కానీ సీఎం జగన్ మాత్రం ప్రభుత్వ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఇచ్చే విద్యాకానుకకు సంబంధించిన కిట్ మొత్తం దగ్గరుండి తానే పర్యవేక్షించి నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా టెండర్లను దగ్గరుండి పర్యవేక్షించి మంచి క్వాలిటీతో కూడిన వాటిని అందచేస్తున్నారు. ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుంటే ఇంకా మాట్లాడానికి ఏమి ఉంటుంది.

అందుకే టీడీపీ నేతలు జగన్ సర్కార్ ఇస్తున్న విద్యాకానుకపై వైసీపీ రంగులున్నాయని, బెల్ట్ వైసీపీ రంగుతో కలిగి ఉందని, పుస్తకాలు గతంలో మేము ఇచ్చామని ఇప్పుడు మీరు కొత్తగా ఇచ్చేదేమిటని అంటూ టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గుస్సవుతున్నారు. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ పాటశాలలు ఎలా ఉండేవో చెప్పవలసిన పనిలేదు. విరిగిపోయిన బెంచీలు పక్కనపడేసి పిల్లలను కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. ఊడిపోయే పెచ్చులు, పనికిరాని ఫాన్స్, టాయిలెట్స్ లేక ఇబ్బందులకు గురయ్యే చిన్నారులు, ఎన్నో ఇబ్బందుల పాలవ్వడంతో ప్రభుత్వ పాటశాలలకు పంపించడం మానేసి తల్లితండ్రులు పిల్లలను ఖర్చైనా ప్రైవేట్ పాటశాలలకు పంపిస్తున్నారు.

జగన్ సర్కార్ తీసుకొస్తున్న నూతన విధానంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా తయారవ్వడంతో లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు మారిపోతుండటంతో టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. ఒకవైపున నాణ్యతతో కూడా విద్యాకానుక, మరొక వైపున కార్పొరేట్ లెవల్ లో స్కూల్స్ తయారుకావడంతో రంగుల రాజకీయం మరొకసారి టీడీపీ బుజానికెత్తుకుంది.