‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు దర్శకుడు తేజ. ఆయన ప్రస్తుతం గోపిచంద్, రానాలతో సినిమాలను తీస్తున్నాడు. ఇక తేజ.. గోపిచంద్ తో తీస్తున్న సినిమా ‘అలివేలు వెంకట రమణ’. ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కాజల్ ఈ ప్రాజెక్ట్ నుండి అనుకోకుండా తప్పుకుందట. అందువల్ల కాజల్ ప్లేస్ లో ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని తేజ భావిస్తున్నారట.

కాగా లేడి ఓరియెంటెడ్ సినిమా కాబట్టి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తేజా భావిస్తున్నారు. ఇప్పటికే గోపిచంద్-అనుష్క కాంబినేషన్ లో ‘లక్ష్యం’, ‘శౌర్యం’ సినిమాలు వచ్చి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక అన్ని కుదిరితే వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

బాలీవుడ్ నటి ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్..!

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఆపకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపుతా..!