తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పదవ తరగతి పరీక్షలను జూన్ 8వ తేదీ నుండి నిర్వహించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కోర్టు అనుమతితో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇక పరీక్షా కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి తెలియచేసారు. ఇక పది పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 12.15 గంటల వరకు జరుగుతాయి.

జూన్ 8వ తేదీ (సోమవారం) ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
11వ తేదీ (గురువారం) ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
14వ తేదీ (ఆదివారం) గణితము మొదటి పేపర్‌
17వ తేదీ (బుధవారం) గణితము రెండో పేపర్‌
20వ తేదీ (శనివారం) సామాన్య శాస్త్రం మొదటి పేపర్‌
23వ తేదీ (మంగళవారం) సామాన్య శాస్త్రం రెండో పేపర్‌
26వ తేదీ (శుక్రవారం) సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌
29వ తేదీ (సోమవారం) సాంఘిక శాస్త్రం రెండో పేపర్‌
జూలై 02వ తేదీ (గురువారం) ఓరియంటల్‌‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌‌ (సంస్కృతము, అరబిక్‌)
జూలై 05వ తేదీ (ఆదివారం) ఓరియంటల్‌‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌), ఒకేషనల్‌ కోర్స్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తెలుగు బిగ్ బాస్-4 కంటెస్టెంట్స్..?

ఏపీలో 2500 దాటిన పాజిటివ్ కేసులు.. 55 మరణాలు..!