కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కాలం చెల్లి వరుసగా రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొని, మరోవైపు మీడియా సంస్థలన్నీ రాష్ట్రంలో టీడీపీ తప్ప మరొక పార్టీ అధికారంలో ఉండకూడదని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బతికించడానికి పాదయాత్ర చేసి రాష్ట్రంలో చచ్చుబడిన కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకువస్తే, వైఎస్ చనిపోయిన తరువాత అదే కాంగ్రెస్ నాయకులు వైఎస్ కుటుంబంపై సోనియా గాంధీ మీద ప్రేమతో వైఎస్ సతీమణి విజయమ్మని రోడ్డుపైకి ఈడ్చి, జగన్ ను జైలు పాలు చేసి ఎన్నో చిత్ర హింసలు గురిచేస్తే లెగవని నోర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో బతికి బట్ట కట్టే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలకు వైఎస్ఆర్ గుర్తుకు వస్తున్నాడు.

రేపు అనగా జులై 8వ తారీఖున వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారట. వైఎస్ఆర్ చేపట్టిన పధకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందాయని, ప్రజలు ఎప్పటికి వైఎస్ సేవలు మరిచిపోలేరని షబ్బీర్ ఆలీ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ ఫోటో కూడా వాడకుండా చంద్రబాబు నాయుడు ఫొటోలతో ఎన్నికలకు పోయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికి జ్ఞానోదయం అయినట్లు ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •