తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా విరుచుకు పడుతుంది. ఆదివారం మరో 1590 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో జిహెచ్ఏంసి పరిధిలోనే 1277 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక 5290 శాంపిల్స్ పరీక్షించగా, 1590 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్రఆరోగ్య శాఖ తెలియచేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23902 కి చేరింది. ఇక తాజాగా ఏడుగురు కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 295 కి చేరింది.

ఇక వీరిలో తాజాగా 1166 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12703 కి చేరగా, ఇంకా 10904 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 115835 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పరీక్షలను పరిశీలించినట్లయితే బాధితుల్లో పురుషులే ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం బాధితుల్లో పురుషులు 15559 మంది కాగా, మహిళలు 8343 మంది ఉన్నారు.

జ్ఞానం కంటే డబ్బెక్కువ ఉంటే ఇలాంటి పనులే చేస్తారు

వ్యాపారి మృతితో తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు