తెలంగాణపై కరోనా వైరస్ తీవ్రంగా విరుచుకు పడుతుంది. ఈరోజు 3457 శాంపిల్స్ పరీక్షించగా, 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జిహెచ్ఏంసి పరిధిలోనే 869 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 16339 కి చేరింది.

ఇక వీరిలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7294 కి చేరగా, ఇంకా 8785 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈరోజు తాజాగా మరో ఏడుగురు కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 260 కి చేరుకుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా నమోదైన మొత్తం 16339 పాజిటివ్ కేసుల్లో ఒక్క జిహెచ్ఏంసి పరిధిలోనే 12682 పాజిటివ్ కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపుతోంది.

కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని మోదీ కీలక సూచనలు.. ముందు వారికే..!

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. అన్‌లాక్‌ 2.0 పై కీలక వ్యాఖ్యలు..!

టిక్ టాక్ పోతే పోయింది.. ‘చింగారి’ వచ్చిందిగా..!