తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా మరో 45 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 1699 కి చేరింది. ఇక వీరిలో మొత్తం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1036 కి చేరగా, ఇంకా 618 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 45 కి చేరింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని, అంతేకాకుండా గత 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గూగుల్ మ్యాప్స్ కాపురంలో కలతలు రేపింది..

అంబులెన్స్ లో గర్భిణీ.. అడ్డుతగిలిన సింహాలు..!