తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 1761 కి చేరింది. ఇక వీరిలో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1043 కి చేరగా, ఇంకా 670 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక తాజాగా కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో, మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 48 కి చేరింది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదవగా వలసదారులు 19 మంది ఉన్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని, అంతేకాకుండా గత 14 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఈ రెండు తేదీలను ఎప్పటికి మరచిపోనంటున్న నాగార్జున..!

బుస కొట్టే ప్రతి పాము కాటు వేయలేదు నాగబాబు