తెలంగాణ గవర్నర్ “తమిళ సై” ఈరోజు ‘సైరా’ సినిమాను తన కుటుంబసభ్యులతో కలసి వీక్షించారు. ఈ సినిమా చూసిన అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ ‘సైరా’ సినిమా చాల బాగుందని, ఇంతటి గొప్ప సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర యూనిట్ కు నా అబినందనలని, సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి చాల అద్భుతంగా నటించాడని అన్నారు.

గత అక్టోబర్ 2న విడుదలైన ‘సైరా’ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయల షేర్ సాధించడం విశేషం. ఇక మరొక నాలుగు రోజులు దసరా సెలవులు ఉండటంతో ‘సైరా’ హావ ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉంది. అమెరికాలో 2 మిలియన్ డాలర్లు క్రాస్ చేసి 3 మిలియన్ కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతుంది. నైజాంలో మొదటి నాలుగు రోజులలోనే 20 కోట్లు కలెక్ట్ చేసి చిరంజీవి స్టామినా మరోసారి చూపించింది. రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను “కొణిదెల ప్రొడక్షన్స్” బ్యానేర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.