తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై ఈ రోజు అఖిల పక్ష సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలను జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్యఉద్దెశం జీతభత్యాలు కాదని ఆర్టీసీని రక్షించుకోవడమే అన్నారు. నేనే రాజు నేనే మంత్రి అన్న తరహాలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మండి పడ్డారు.

7000 మంది పదవి విరమణ పొందినా కూడా గత ఐదు సంవత్సరాల నుండి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదని అన్నారు. ఆర్టీసీకి రావలసిన బకాయలు ఎందుకు చెలించడం లేదన్న ఆయన.. రాష్ట్రంలో నాలుగవ వంతు ప్రజలు ప్రజా రవాణాపై ఆధారపడి ఉన్నారని.. వారంతా సమ్మెకు మద్దతు పలుకుతున్నారన్నారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలిపునిస్తామని అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు.

ఇక ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తో పాటు, బీజేపీ నుండి రామచంద్రరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ఈ భేటీలో చర్చించారు.