టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెను మరింత ఉదృతం చేయబోతున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఇందులో భాగంగా ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, 14న అన్ని డిపోల ఎదుట బైఠాయింపు, బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న ఐకాసా కి మద్దతుగా ర్యాలీలు, 17న ధూమ్ ధామ్ కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు, 19న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్దమవుతుంది.