జాఫర్ అంటేనే యాటిట్యూడ్… యాటిట్యూడ్ అంటేనే జాఫర్ అనేలా రాజకీయ నాయకులను, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని ఇంటర్వూస్ చేస్తూ కాలు మీద కాలు వేసుకొని, ఎవరకి భయపడకుండా తనకు నచ్చిన తిక్క ప్రశ్నలు అడిగి ఒక్కోసారి తిట్టించుకుంటాడు… ఒక్కోసారి పొగిడించుకుంటాడు. అలాంటి జాఫర్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటాడా అన్నది జాఫర్ ను ఫాలో అయ్యేవారి మనస్సులో మెదిలింది.

ఇక మొదటి రోజు బిగ్ బాస్ లో భాగంగా ఉదయం లేచిన తరువాత జాఫర్ మరియు బాబా భాస్కర్ ఉదయాన్నే కామెడీ పండించేలా వారు చేసిన భంగిమలు సరదా సరదాగా అనిపించాయి. జాఫర్ కూడా బిగ్ బాస్ లో తానంటే ఏమిటో ప్రూ చేసుకునే భాగంలో అందరితో కలసి పోయేలా మాటలను కలుపుతూ కనిపించాడు. ఇక మొదటి వారంలోనే నామినేట్ అయిన జాఫర్, ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇంకెన్ని కామెడీ స్కిట్ లతో అలరిస్తాడో చూడాలి.


Tags: Big Boss


  •  
  •  
  •  
  •  
  •  
  •