చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీతో కొత్తగా జత కట్టిన తరువాత చంద్రబాబు నాయుడు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల అధ్యక్షుల దగ్గరకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేదానిలో సహకరించాలని కోరారు. అది కాంగ్రెస్ పార్టీతో కలసి ఏర్పాటు చేసే కూటమిగా ఉండాలనట్లు మాటలు చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గరకు వెళ్లి కలసి వచ్చాడో వారందరు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతోనే ఉండి వారి వారి రాష్ట్రాలలో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీతో కలసి చేసే హడావిడి ఏమిటో తెలియక అందరూ బుర్రలు పట్టుకుంటున్నారు.

ఇక తెలంగాణాలో కూడా తనదైన రీతిలో రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీని తానే ముందుండి నడిపించేది అన్నట్లు బిల్డ్ అప్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బిల్డ్ అప్ ఇవ్వడం వరకే పరిమితమయ్యారు తప్ప, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడుతో కలసి పోటీ చేయడంతో రెండు సీట్లు తక్కువకే పరిమితమై మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైయ్యారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ కనుక చంద్రబాబు నాయుడుతో కలసి పోటీ చేయకపోయినట్లైతే టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

ఇక తాను కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో, ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి రిజల్ట్స్ నే వస్తాయని చంద్రబాబు నాయుడుకి బెంగపట్టుకునట్లు కనపడుతుంది. ఒకవైపున చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను కలిపేది తానే అని ఒకవైపున చెబుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరోసారి ప్రమాణస్వీకారం చేసిన తరువాత కేసీఆర్ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకులతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఒక తాటిపైకి తీసుకొని వచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.

చంద్రబాబు నాయుడుకి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చే మూడు నెలలో ముంచుకురానున్నాయి. వాటిలో నెగ్గితే చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తన చక్రం కాస్తో కూస్తో తిరుగుతుంది. లేని పక్షంలో చంద్రబాబు నాయుడుని పట్టించుకొనే నాధుడే కనపడడు. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు. భూ కుంభకోణాల మొదలు, ఇసుక మాఫియా, రైతుల దగ్గర భూదోపిడీ, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల అరాచకాలు ఇలా ఎన్నో చేసారు.

వీటన్నితో ప్రజలు విసిగి వేసారి పోయి, వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష వైసిపి పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఓడిపోతానని తెలిసి కూడా పైకి గుమ్మనంగా ఉంటూ రోజుకొక శంకుస్థాపనల పేరుతో ప్రజల డబ్బుని కోట్లలో ఖర్చుపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికలలో మోదీ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలసి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడంతోనే బొటాబొటిగా నెగ్గుకొచ్చారు. ఈసారి వారిద్దరూ వేరుకుంపటి పెట్టుకొని చంద్రబాబుకి దూరంగా జరగటంతో చంద్రబాబుకి గెలుపు భయం పట్టుకుంది.   

చంద్రబాబు నాయుడు ముందు దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకొని వచ్చి చక్రం తిప్పుతున్నానని చెప్పే బదులు వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో ఎలా నెగ్గుకురావాలో అలోచించి తరువాత దేశ వ్యాప్తంగా చక్రం తిప్పవచ్చని తెలుగు తమ్ముళ్లు గుస గుసలాడుకుంటున్నారు.