ఉండవల్లి కరకట్ట మీద అక్రమ కట్టడంపై తెలుగుదేశం పార్టీలో రచ్చ షురూ అయినట్లు తెలుస్తుంది. ప్రజావేదికపై ముందు నుంచి బుద్ధ వెంకన్న… చంద్రబాబు నాయుడుకి అండగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ, వైఎస్ జగన్ పైన ఆరోపణలు గుప్పిస్తూ రెండు రోజుల నుంచి మీడియాలో యాక్టీవ్ గా కనపడుతున్నారు. దీనిపై ఇప్పటికే కేశినేని నాని స్పందిస్తూ ప్రభుత్వానికి కొంత సపోర్ట్ చేసినట్లు మాట్లాడటంతో టీడీపీ డిఫన్స్ లో పడింది.

ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలో రామచంద్రపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వచ్చి చేరారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చడం సబబేనని, దానితో పాటు కరకట్ట మీద ఉన్న అన్ని కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వం తన నిబద్ధతను నిలుపుకోవాలని అన్నారు. ఈ విషయంలో బుద్ధ వెంకన్న తీరుని కూడా తప్పు పట్టినట్లు తెలుస్తుంది. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడుకి భజన చేయడం మానుకోవాలని ఘాటుగా సలహా ఇచ్చారట. తోట త్రిమూర్తుల వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాకినాడ వేదికగా తోట త్రిమూర్తులు అండ్ కో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం అయిన విషయం తెలిసిందే.
  •  
  •  
  •  
  •  
  •  
  •