జగన్, కేసీఆర్ ఇద్దరు కలసి ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుంటూరు జిల్లా పెదరావూరులో ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం – జనసేన పార్టీ కలసి పోటీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయాలని బహిరంగ సభ వేదికగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కచ్చితంగా మరోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటి నుంచే అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు వైసీపీ పార్టీని బలహీన పర్చడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో తన వద్దకు పొత్తు ప్రతిపాదన చేశారని చెప్పి కలకలం సృష్ట్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడుపై కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేయడంతో జనసేన – టీడీపీ బంధం బట్టబయలైనట్లు తెలుస్తుంది.