మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేట్ జారీ చేస్తున్నాడు. ప్రభుత్వం వచ్చి మూడు నెలలే అవుతుంది. కానీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలే ఉన్నాయనట్లు హడావిడి చేస్తుండటంతో అందరూ విస్తుపోతున్నారు. అసలు జగన్ సీఎం అయిన నెలరోజులకు తెలుగుదేశం కార్యకర్తల ఇంటింటికి తిరగడం మొదలు పెట్టాడు. అందులో ముఖ్యకారణం ఆ కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడుకి ప్రేమ ఎక్కువై అనుకుంటున్నారా.

చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఒకరిపై దయ చూపించిన ధాఖలాలు ఉన్నాయా? సొంత మామనే కనికరించకుండా తనది కానీ పార్టీ నుంచి గెంటి వేశాడు. మరి ఇప్పుడు ఈ హడావిడి అంతా కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు. ఇప్పటికే దాదాపుగా 10 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్ లో ఉన్నారట. మరికొంత మందు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారు.

ఈ మధ్య బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర రావు తెలియచేస్తూ త్వరలో ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించబోతున్నామని తెలియచేసారు. ఇక ఎమ్మెల్యేలు మరొకొన్ని రోజుల తరువాత ఎవరు తెలుగుదేశంలో ఉండేలా లేరు. వారిని కొన్ని రోజులైనా తెలుగుదేశం పార్టీ విడిచి పోకుండా ఉండాలంటే రాజకీయంగా ఏదో ఒక హడావిడి చేయాలి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడుకు భజన చేయడానికి దండిగా మీడియా చానెల్స్ ఉన్నాయి.

వాటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, రాష్ట్రం రావణకాష్టంలా మండిపోతుందని, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతలు క్షీణించాయని, సీఎం జగన్ కన్నా తన తండ్రి రాజశేఖర్ రెడ్డినే నయమని ప్రజలు తప్పు దారి పట్టించే పనిలో నిమగ్నమయ్యాడు. అందులో భాగంగానే ఈరోజు పల్నాడు పర్యటన చేపట్టాడు. గత ఐదేళ్లలో పల్నాడులో తెలుగుదేశం నేతల అకృత్యాలకు ఎంతో మంది వైసీపీ నేతలతో పాటు తెలుగుదేశం సానుభూతి పరులు కూడా యరపతినేని, కోడెల దెబ్బకు అల్లాడిపోయారు.

కానీ చంద్రబాబు మాత్రం లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టించి రాజకీయంగా బూస్టింగ్ తెచ్చుకొని కార్యకర్తలతో పాటు నాయకులు ఎక్కడ ఆత్మ స్థైరం కోల్పోకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలే తప్ప పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అరాచకాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ హడావిడి మొత్తం చూస్తూ పల్నాడు ప్రాంతంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలే నోరెళ్లబెడుతున్నారట.

ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత హడావిడి చేసి తమకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుందనని వాపోతున్నారట. చంద్రబాబు నాయుడుకి రాజకీయమే కావాలి తప్ప ప్రజల బాగోగులు అవసరం లేదు. అసలు ఎప్పుడు ప్రజల గురించి పట్టించుకున్నాడు కనుక, చంద్రబాబు హయం అంటే పక్క పార్టీల వారు ఇక తమకు ఈ ఐదేళ్లు ప్రభుత్వం తరుపున రావలసిన పధకాలేవి అందవని ఫిక్స్ అయిపోతారు.

కానీ జగన్ వచ్చిన తరువాత తాను ఒక్క వైసీపీ కార్యకర్తలకు కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సీఎం అని, రాష్ట్రంలో ఉన్న ప్రతిఒక్కరికి అర్హులు అనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పధకాలు అందాలని గట్టిగా చెబుతున్న విషయం తెలిసిందే. ఇంకొన్ని రోజులు వెళితే చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి చూసి తెలుగుదేశం కార్యకర్తలే మమల్ని బతకనివ్వు సామి అని వేసుకునేలా ఉండే పరిస్థితి నెలకొనేలా ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •