తెలుగుదేశం పార్టీ మొత్తం చంద్రబాబు కనుసన్నలలోనే నడుస్తుంది. చంద్రబాబు అవునంటే ముందుకు… కాదంటే వెనక్కు, ఇలా ఉంటుంది పరిస్థితి. ఇక తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో అంతా ఆహా… ఓహో అంటూ భజన కార్యక్రమాలే తప్ప… తప్పు ఎక్కడ జరుగుతుంది… దానిని ఎలా సరిదిద్దుకోవాలని చెప్పే నాధుడే ఉండేవాడు కాదు. ఒకవేళ అలా చెబితే అతనిని మెడ పెట్టి బయటకు గెంటేస్తారు. ఇక లోకేష్ బాబు వచ్చాకా ఈ సంస్కృతి మరీ పెరిగింది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా లోకేష్ బాబు వ్యవహారం పార్టీ సీనియర్స్ కు అసలు రుచించడం లేదు. బీజేపీలో చేరిన తరువాత సుజనా చౌదరి కూడా చంద్రబాబుకు తాను లాయల్టీని తప్ప లోకేష్ బాబు వ్యవహారశైలి నాకు నచ్చేది కాదని, ఇప్పటికి చంద్రబాబే నా బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఇక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. పార్టీపై సమీక్ష చేయడంలో భాగంగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నికలలో ఓడిపోవడానికి గల కారణాలు కనుకున్నారట. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గొప్పగా పరిపాలించాడు అని చెప్పేవారే కరువయ్యారట. కొంత మంది అయితే సామజిక సమతుల్యత లోపించిందని వ్యాఖ్యానిస్తున్నారట.

తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో చర్చించినా చర్చించాక పోయినా… ఒక కుల ఆధిపత్యంతో చంద్రబాబు నాయుడు వారి మాటనే వింటూ… ఒక కోటరిని ఏర్పాటు చేసుకొని మిగతా కులాల వారిని లెక్కచేయకుండా రాజధాని ప్రాంతంలో భూముల నుంచి ఇసుక దోపిడీ… ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి గత ఐదు సంవత్సరాలలో ఆ కులానికి ఎంత దోచిపెట్టాలో అంతా దోచిపెట్టేసారు.

ఇక రాయలసీమలో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న రెడ్లను తొక్కివేస్తూ సీఎం రమేష్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నడవాలని హుకుం జారీ చేయడం సీఎం రమేష్ కింద పనిచేయడానికి ఇష్టపడకపోవడంతో… పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టి రాయలసీమ ప్రాంతంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇక గోదావరి జిల్లాలో కూడా ముద్రగడ పద్మనాభం కుటుంబం మీద చేసిన అరాచకాలు… ముద్రగడ పద్మనాభం ఒక్కడే మనల్ని ఏమి చేడగలగాడు అన్న ధోరణితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించడంతో దీని అంతటి వెనుక లోకేష్ బాబు పాత్ర ఉందన్న భావనలో ప్రజలు భావించడంతో గత ఎన్నికలలో వైసీపీ ఓటమికి కారణమైన గోదావరి ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీకి గోరి కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

అసలు ఎవరు ఏమనుకున్నా… చంద్రబాబు నాయుడు ఓటమిలో మాత్రం ఒక కులానికి అందె వేసేలా నిర్ణయాలు ఉండటం 50 శాతం కారణం అయితే… మిగతా 50 శాతం అమరావతిలో భూముల స్వాహా దగ్గర నుంచి ప్రతి గ్రామంలో తెలుగుదేశం నాయకులు కబ్జాలకు తెగబడటం… జన్మభూమి కమిటీలతో విచ్చలవిడిగా దోచుకోవడం మరొక 50 శాతం చంద్రబాబు నాయుడును ప్రజలు ఓడిపోయేలా చేసారు. అధికారంలో ఉనప్పుడు పొలిట్ బ్యూరో సమావేశంలో సూచనలు సలహాలు ఇవ్వకుండా… మా పార్టీ తోపు… తురుము అని పొగిడి ఈరోజు… అదే పొలిట్ బ్యూరో సమావేశంలో ఓటమి తరువాత సవాలక్ష కారణాలు చెబుతుంటే తెలుగుదేశం పార్టీలో నికార్సైన సామాన్య కార్యకర్త ఇదేమి కర్మరా బాబు అనుకుంటున్నాడు. అంతే మరి ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎక్కడైనా అలానే ఉంటుంది. అధినేత నిర్ణయాలు నడిచినంత కాలం… అబ్బో అంటారు ఒక్కసారి రివర్స్ అయితే పార్టీని బ్రష్టు పట్టించారని శాపనార్ధాలు పెడతారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •