యువ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా సినిమా ‘అశ్వథామ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

తాజాగా నాగశౌర్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు అసలే షార్ట్ టెంపర్ ఉందని చెప్పారు. తరుచుగా నా దర్శకులు, రచయతలు, కెమెరామెన్లపై అరుస్తానని.. అయితే సినిమా మంచి అవుట్ ఫుట్ సాధించడానికి మాత్రమే ఆవిధంగా చేస్తానని అన్నారు. సినిమా బాగా ఆడితేనే మా కెరీర్లు వృద్ధి చెందుతాయని.. నేను మా టీం అందరి కెరీర్ కోసమే వారిపై అరుస్తానని చెప్పుకొచ్చారు నాగశౌర్య.

  •  
  •  
  •  
  •  
  •  
  •