మన దేశంలో కొన్ని లక్షల కేసులో పెండింగ్ లో ఉండటంతో కోర్టులు వాటిని పరిష్కరించడానికి ముప్పుతిప్పలు పడుతుంటాయి. వీటిలో కొన్ని కేసులు సిల్లీగా కూడా ఉంటాయి. అందులో భాగంగానే ఒక యువతి తన తండ్రిపై ఏకంగా ఫ్యామిలీ కోర్టులో కేసు వేసి అతడిని మందలించాలని కోరుతుందంటే దాని కారణం తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. 24 ఏళ్ళ యువతి తన తండ్రితో కలసి ఎప్పుడు లూడో గేమ్ ఆడుతుంటుంది. ఈ గేమ్ లో ఎప్పుడు ఆ యువతి ఓడిపోవడంతో పాటు తన తండ్రి మంచి విజయాలను సొంత చేసుకోవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన తండ్రితో ప్రతిసారి ఓడిపోవడంతో తన తండ్రి తనను మోసం చేసి గెలుస్తున్నదని భావించి ఏకంగా ఫామిలీ కోర్టుని ఆశ్రయించింది.

తన తండ్రి తనను మోసం చేసి గేమ్ గెలుస్తున్నాడని తాను ఎంత నిజాయితీగా ఉండాలని ప్రయత్నించినా తాను ఆటను నిజాయితీగా ఆడటం లేదని, దీనికి మీరే పరిష్కారం చెప్పాలని కోరుతుంది. దీనిపై కోర్టు ఈ కేసుని ఒక మానసిక సమస్యగా తీసుకొని భోపాల్ ఫ్యామిలీ కోర్టు ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాను తన తండ్రిపై లూడో గేమ్ గెలిస్తే ఎంతో ఆనందపడిపోతుంది. ఇలా చిన్న చిన్న ఆనందాలను ఆ యువతి కోరుకుంటుందని తేల్చారు. కానీ తాను ఓడిపోతే తట్టుకోలేకపోవడంతో కాస్త మానసిక సంఘర్షణకు గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏడో తరగతి యువకుడు కరోనా టీకాను కనిపెట్టానని హల్ చల్, ఉలిక్కిపడ్డ పోలీసులు

డ్రగ్స్ కేసు వివాదంతో శివసేన సంచలన నిర్ణయం దిశగా అడుగులు