పరమశివుని శివలింగాలు ఒక్కోచోట ఒకొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాంటి శివలాంగాలలో డెహ్రాడూన్ సమీపంలోని తపకేశ్వర్ గుహల్లోని శివుని దేవాలయానికి 6000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందట. ఇక్కడ శివలింగం ఉన్న ప్రాంతంలో గుహ నుండి ఎల్లప్పుడూ నీరు ధారగా పడుతూనే ఉంటుందట. ఈ నీరు ఎక్కడ నుంచి వస్తుంది, అసలు ఎక్కడ మొదలవుతుందో ఇప్పటి వరకు అంతు చిక్కలేదట. ఎంతో మంది తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతున్నారు. మహాభారత యుద్ధ సమయంలో ఇక్కడ ద్రోణుడు ధ్యానం చేశాడని అందుకే ఈ గుహాలని ద్రోణ గుహాలని కూడా అంటారని చరిత్ర కారులు చెబుతున్నారు.