విద్యార్థులు తప్పు చేస్తే దండించే స్కూల్స్ ఉన్నాయి… వారు మరింత పెద్ద తప్పు చేస్తే పేరెంట్స్ ను పిలిపించి టీసీ ఇచ్చి పంపించి వేసే మరికొన్ని స్కూల్స్ చూశాము తప్ప… విద్యార్థులు తప్పు చేస్తే వారి చేత ఒక మొక్క నాటించి దాని సంరక్షణ బాధ్యత కూడా వారికే అప్పజెప్పే స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూడలేదు. గుజరాత్ లోని వీర్ నర్మద సౌత్ గుజరాత్ యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ సబ్జెక్టు బోధిస్తున్న ప్రొఫెసర్ మోహు పటేల్ ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. 

దీనితో ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీలో మొత్తం ఎనిమిదేళ్లలో 550 కు పైగా మొక్కలు నాటారట. తప్పు చేస్తే మొక్కే కదా నాటేది అనుకుంటే పొరపాటే. అతడు మొక్క నాటుతున్నాడంటే యూనివర్సిటీ మొత్తం చెప్పుకుంటారట. అది చాల ఇన్సల్ట్ గా ఫీలై చాల మంది తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారట.