సుందర్ పార్(65) అనే వ్యక్తి డబ్బు సంపాదనకు సులువయిన మార్గాన్ని ఎంచుకుని.. దానినే వృత్తిగా మలుచుకున్నాడు. ముంబైకి చెందిన సుందర్ పార్ అనే వ్యక్తి సోమవారం రైలులో కోయం బత్తుర్ కి వెళుతూ గుంతకల్లు జంక్షన్లో దిగాడు. ఓ ప్లాట్ ఫారం లో ఉన్న క్యాటరింగ్ స్టాల్ కి వెళ్లి వెజిటల్ బిర్యాని కొని అక్కడే తిన్నాడు. బిర్యానీలో బల్లి ఉందని చెప్పిన అతను.. తాను అస్వస్థతకు గురి అయ్యానని.. హోటల్ యాజమాన్యానికి తెలిపాడు. హోటల్ యాజమాన్యం అతనికి వైద్యం అందించారు. ఇదే విషయాన్ని తాను అందరికి చెబుతానని చెప్పడంతో హోటల్ యాజమాన్యం అతనికి ఐదు వేల రూపాయలు ఇచ్చారు.

అయితే విషయం తెలిసిన రైల్వే అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. అయితే ఇదే వ్యక్తి మూడు రోజుల కిందట జబల్ పూర్ లో కూడా సమోసాలొ బల్లి వచ్చిందని చెప్పి.. 50 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ దొరికిన ఫోటోలు ఆధారంగా సమోసాలొ బల్లిని పోలి ఉన్న సగం చేప ఫోటోలను అధికారులు సేకరించారు. మిగిలిన సగం చేపను బిర్యానీలో పెట్టి బల్లి పడినట్లు నాటకం ఆడాడు.

ఈ విధంగా బతుకు తెరువు కోసం చేపను పోలిన బల్లిని బిర్యానీలో పెట్టి మోసం చేసి డబ్బు వసూలు చేస్తాడన్నారు అధికారులు. అయితే నిందితుడు విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు సీనియర్ డీసీఎం ప్రశాంత్ కుమార్.


Tags: Biryani, Lizard


  •  
  •  
  •  
  •  
  •  
  •