రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన “బాహుబలి” సినిమా ఎంతటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా మొదలై సరిగ్గా ఈరోజుతో ఏడేళ్లు పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. జులై 6, 2013లో ఈ చిత్ర షూటింగ్ కర్నూల్ రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభమైంది. అప్పట్లో ప్రభాస్ ను చూడటానికి కర్నూల్ చుట్టుపక్కల నుంచి వేలాదిగా తరలివచ్చారు.

రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం మొదటి భాగం కన్నా రెండవ భాగం సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా వెయ్యి కోట్ల మార్క్ దాటినా మొదటి భారతీయ చిత్రంగా రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన “సాహో” చిత్రం అంతంత మాత్రం ఉన్నా ఉత్తరాది ప్రజలు ప్రభాస్ ను ఆదరించడానికి కారణం బాహుబలి సినిమా ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు.