‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత పూరి జగన్నాధ్.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక యాక్షన్ ద్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా తన తొలి పాన్ ఇండియా సినిమా అని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. నా తొలి పాన్ ఇండియా సినిమా పూరితో చేస్తున్నానని.. ఈ సినిమా కోసం చాలా ఉత్సాకంగా ఉన్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం నా బాడీ షేప్ కూడా మార్చుకున్నానని విజయ్ తెలిపాడు.

ఇక ఈ సినిమా బాలీవుడ్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నాడు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషలలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •