టిక్ టాక్ చేయకుండా చూడకుండా నిద్రలేని రాత్రులు గడిపే నెటిజన్స్ ఇప్పుడు టిక్ టాక్ ను భారత్ ప్రభుత్వం నిషేధించడంతో కొంత మందికి రాత్రులు నిద్రకూడా రావడం లేదట. టిక్ టాక్ ఇండియా హెడ్ తాము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, టిక్ టాక్ కోసం ఇండియాలో రెండు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారని, వారికి భరోసా కల్పిస్తూ త్వరలో టిక్ టాక్ తిరిగి పునః ప్రారంభించే దిశగా ఆలోచిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

మన ఇండియాలో టిక్ టాక్ కు సంబంధించిన సమాచారాన్ని అంతా సింగపూర్ లో ఉన్న సర్వర్లలో దాచి ఉంచినట్లు చెప్పారు. తమను ఇంతవరకు చైనా ప్రభుత్వం ఇండియా నెటిజన్స్ కు సంబంధించిన సమాచారం అడగలేదని, అలా అడిగిన ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. టిక్ టాక్ కనుక మరల తిరిగి ఇండియాలో ప్రారంభమైతే ఇండియాలోనే సర్వర్లలో భద్రపరిచేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు.

కానీ వారు ఎంత చెబుతున్న భారత్ ప్రభుత్వం మాత్రం టిక్ టాక్ తో పాటు నిషేధించిన 59 యాప్ లను తిరిగి తీసుకువచ్చే సూచనలు లేవని తెలుస్తుంది. టిక్ టాక్ యాప్ నడుపుతుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ అన్న అనుమానాలు కూడా రావడంతో టిక్ టాక్ తో పాటు మిగిలిన 59 యాప్ ల వలన ఎలాంటి భద్రత లేదని భారత్ ప్రభుత్వం భావిస్తుంది. కానీ టిక్ టాక్ యాజమాన్యం మాత్రం ప్రధాని మోదీపై కాస్త ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ చైనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చైనాకు సరైన బుద్ధి చెప్పడం ఇప్పుడే మొదలైందని, ముందు ముందు మరింత తీవ్రంగా పరిస్థితులు ఉంటాయని ఘాటుగా చెబుతున్నారట. టిక్ టాక్ వలన దాదాపుగా బైట్ డ్యాన్స్ కంపెనీకి 45 వేల కోట్ల నష్టం రాగా, మిగిలిన అన్ని యాప్స్ కలిపి మొత్తం లక్ష కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు టెక్నాలజీ వర్గాలు చెబుతున్నాయి.

పెళ్ళైన మొదటి రాత్రే “గే” అని తేలిందంటున్న నగ్నం హీరోయిన్