ఇప్పటికే టిక్ టాక్ ప్రపంచం మొత్తం షేక్ చేస్తుంది. ఇండియాలో అయితే దాదాపుగా 10 రోజుల పాటు టిక్ టాక్ బ్యాన్ చేసి తరువాత ఎత్తివేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టిక్ టాక్ వాడొద్దని మీ పిల్లలను మీరే కంట్రోల్ లో పెట్టుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే టిక్ టాక్ ఎంతలా యూత్ ను ఆకట్టుకుందో తెలుస్తూనే ఉంది. కొన్ని చోట్ల టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు ఉంటే… మరి కొన్ని చోట్ల టిక్ టాక్ తో సెలెబ్రేటిస్ అయిన వారు కూడా ఉన్నారు.

ఇక అలాంటి టిక్ టాక్ ఓనర్ బైట్ డాన్స్ త్వరలో సెర్చ్ ఇంజిన్ లాంచ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. ఇక తాను మొదలు పెట్టబోయే సెర్చ్ ఇంజిన్ కోసం భారీగా వేతనాలు ఇచ్చి గూగుల్, మైక్రోసాఫ్ట్, బైడు నుంచి టెక్నికల్ ఎక్స్ పర్ట్ లను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సెర్చ్ ఇంజిన్ ద్వారా యూజర్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తో పాటు, ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ను ఫాలో అయ్యేలా ఉంటుందని… మరొక సంచలనం క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు. కానీ తాను మొదలు పెట్టే టిక్ టాక్ సెర్చ్ ఇంజిన్ అనుకునంత ఈజీ అయితే కాదన్న విషయం తెలిసిందే. కానీ టిక్ టాక్ వీడియోస్ లా సంచలనాలు సృష్టించడానికి రెడీగా ఉన్నామని బైట్ డాన్స్ చెబుతున్నాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •