టిక్ టాక్ తో సహా 59 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే టిక్ టాక్ పోవడంతో చాలా మంది దానికి ప్ర‌త్యామ్నాయంగా మరో యాప్ ను వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు టిక్ టాక్ కు ప్ర‌త్యామ్నాయంగా ‘చింగారి’ యాప్ ఉండడంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేముంది ఈ యాప్ కు ట్రాఫిక్ ఫుల్ గా పెరిగిందట.

ఇక ఇందులో యూజర్లు వీడియోలను డౌన్ లోడ్, అప్ లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ తో చాట్ చేయవచ్ఛు. కొత్త వారితో ఇంటరాక్ట్ కావచ్ఛు. కంటెంట్ ని షేర్ చేసుకోవచ్ఛు. తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, గుజరాత్, మరాఠి, పంజాబీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘చింగారి’ యాప్ ను ప్రోత్సహించాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సైతం ఈ ‘చింగారి’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు వివరించారు. స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘చింగారి’ యాప్ రూప‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఇక ఆనంద్ మహేంద్ర ఇప్పటివరకు టిక్ టాక్ ను డౌన్ లోడ్ చేసుకోలేదట.

ఇక బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్‌, సిద్ధార్థ్ గౌతమ్ గత ఏడాది ఈ ‘చింగారి’ యాప్ ను రూపొందించారు. తాజాగా చైనా యాప్స్ పై భారత్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ ‘చింగారి’ యాప్ డౌన్‌లోడ్స్ పెరిగిపోయాయి. ఇప్ప‌టికే 1 మిలియ‌న్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది.

చైనీస్ యాప్‌లను భారత్ నిషేదించిన నేపథ్యంలో డ్రాగన్ తన వక్ర బుద్దిని చాటుకుంది..!

మాస్క్ పెట్టుకోమన్నందుకు మహిళను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్..!