మూడు నెలలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అనేక సర్వే సంస్థలు సర్వేలను నిర్వహిస్తు ప్రస్తుత పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగానే టైమ్స్ నౌ – వీఎమ్ఆర్ సంస్థలు చేపట్టిన సర్వేలో ఇపప్టికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పార్టీకి ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలకు 23 స్థానాలను కైవసం చేసుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని తన సర్వేను వెల్లడించింది.

వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య ఓట్ల శాతంలో కూడా బారి వ్యత్యాసాలు ఉండనున్నాయని తెలుస్తుంది. వైసీపీ పార్టీకి 49.5 శాతం ఓట్లు, టిడిపికి 36 శాతం ఓట్లు రానున్నాయని సర్వే వెల్లడించింది. అంటే టీడీపీకి, వైసీపీ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపుగా 13 శాతంకు పైగా ఉండటంతో వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ పార్టీ కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంకు తేడాతో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ ఎన్నికలలో టీడీపీ + బిజెపి + జనసేన పార్టీలు అన్ని కలసి వచ్చినా వైసీపీ పార్టీ దాదాపుగా ఆ మూడు పార్టీలకు సమానంగా ఓట్లు సాధించి సత్తా చాటింది. ఈసారి ఆ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో పాటు వైసీపీ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడంతో… వైసీపీ పార్టీ విజయాన్ని సునాయాసంగా అందుకోగలదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.