2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్ తో చనిపోవడంతో ఇప్పుడు వైసీపీ పార్టీతో పాటు అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని ఉంది. ఇటీవల దుర్గాప్రసాద్ కు కరోనా సోకడంతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరి అయన చికిత్స తీసుకుంటున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి చివరకు అతడి ప్రాణాలను తీసుకోవడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై 1994 చంద్రబాబు హయాంలో ప్రాధమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ముందు వైసిపిలో చేరి తిరుపతి ఎంపీగా గెలుపొందారు.