ఈరోజు ఉదయం విశాఖలో గ్యాస్ లీక్ కావడంతో వెంకటాపురం గ్రామంతో పాటు చుట్టు పక్కల అన్ని గ్రామాల ప్రజలు ఊర్లను వదిలిపెట్టి వెళ్లాలని అధికారులు వేడుకుంటున్నారు. మరొక వైపున ఏపీ ప్రభుత్వం గ్యాస్ లీక్ ఆగిపోవడంతో యంత్రాంగం బాగా స్పందిస్తుంది. జీవీఎంసీ కమీషనర్ & విశాఖ కలెక్టర్,ప్రజాప్రతినిధులు యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపడుతున్నారు. విశాఖ సిటీలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా స్వచ్చందంగా ముందుకు వస్తే ఈ గ్యాస్ దుర్ఘటన నుంచి త్వరగా తేరుకునే అవకాశం దొరుకుతుంది.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్ష పార్టీ అండగా నిలవాల్సింది పోయి అప్పుడే నీచ రాజకీయాలు మొదలు పెట్టడం సిగ్గుచేటు. ఇక గత రెండు నెలలుగా కరోనా వైరస్ తో ప్రజలంతా అల్లాడిపోతుంటే అవేవి పట్టకుండా హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి లేఖ రాస్తూ తాను తక్షణం విశాఖ వెళ్లాలని శవ రాజకీయాలు మొదలుపెట్టాడు. కేంద్రం కూడా చంద్రబాబు నాయుడుకి అనుమతి ఇవ్వడంతో మధ్యాహ్నం 1:30 కు ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లనున్నారు.

చంద్రబాబు అండ్ అతడి ఫ్యామిలీ ఇన్ని రోజులు కరోనా వైరస్ కు బయపడి తమకు వైరస్ ఎక్కడ సోకుతుందో అని హైదరాబాద్ ఇంట్లో నుంచి బయటకు రాకుండా శవ రాజకీయాలు చేసి ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి విశాఖ వెళ్లడానికి పర్మిషన్ కావాలని కోరడం ఎంతవరకు సమంజసం. విశాఖలో గ్యాస్ లీకైనందుకు తాను వెళ్లాలని అసలు చంద్రబాబు నాయుడు ముందుగా తెలంగాణ డీజీపీకి లేఖ రాయాలి. తెలంగాణ ప్రభుత్వం ఏపీ డీజీపీతో మాట్లాడి చంద్రబాబు నాయుడుకి పర్మిషన్ ఇస్తారు. కానీ ఇలా కేంద్ర మంత్రికి లేఖ రాయడం వెనుక అంతరార్ధం ఏమిటో అర్ధం కావడం లేదు.

అసలు ముందు చంద్రబాబు నాయుడుకి ఇంత ఆత్రం ఎందుకు, దేశంలోనే ఏపీలో అత్యధిక కరోనా టెస్ట్ లు చేయడంతో పాటు కరోనా కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటుంటే దానికి సంబంధించి కేంద్రానికి లేఖలు రాయని బాబు, ఇప్పుడు శవ రాజకీయాలు తెరతీయడానికి ఇలా ఇప్పుడు అర్జెంటు గా విశాఖ వెళ్లాలని కోరుకోవడంలో ఆంతర్యం ఏమిటి. ఇలా విపత్తుల సమయంలో శవ రాజకీయాలు చేస్తూ, గత 45 రోజులుగా కరోనా వైరస్ వలన అన్ని రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను అండగా నిలబడుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాలు జుగుత్సాకరం.

ఇన్నాళ్లు హైదరాబాద్ లో ఉన్న బాబు అక్కడే ఇంకొన్నాళ్ళకు ఉండటం వలన ఏపి ప్రజలకు వచ్చిన నష్టమేమి లేదు. ఇలా శవ రాజకీయాలు చేసి తానే గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని… ఈ ప్రభుత్వం అసమర్ధత వలనే గ్యాస్ లీకైందని ప్రచారం చేసి డప్పు కొట్టుకపోవడానికి అప్పుడే టీడీపీ టీమ్ ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టింది ఏపీ ప్రజలు బాగు కచ్చితంగా వీళ్లకు అవసరం లేదు. ఎప్పుడు విపత్తు వస్తే అప్పుడు అక్కడ కుటిల రాజకీయాలు చేయడానికి ముంద వరుసలో నిలబడే ఇలాంటి రాజకీయ నాయకులూ ఇంకేమిపుడు మారతారో.