చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ “ప్రజా చైతన్య యాత్రను” చేపట్టిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఈరోజు చంద్రబాబు యాత్ర ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి యాత్ర మొదలు కానుంది. ఈ యాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు తన ఇంటి నుంచి బయలుదేరే సమయంలో బాలకృష్ణ అభిమానులు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ముందు 200 కొబ్బరికాయలను కొట్టి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

“ప్రజల మంచి కోసం నేనున్నాని” అందుకే ఈ యాత్రను చేయనున్నట్లు బాబు చెప్పుకొచ్చారు. దాదాపుగా 100 నియోజకవర్గాల మీదగా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా మరొకసారి చంద్రబాబు నాయుడుతో కలసి అడుగులో అడుగేయడానికి సిద్ధమవుతున్నారు. నిన్న సీఎం జగన్ కర్నూల్ జిల్లాలో “వైఎస్ఆర్ కంటివెలుగు” మూడవ విడతలో భాగంగా ప్రారంభం అయిన సమయంలో “నా పని తీరు చూసి ఈర్షతో రగిలిపోతున్న చంద్రబాబు నాయుడు కడుపు మంటకు మందులేదని” సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష పార్టీలతో పాటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఈరోజు ప్రజాచైతన్య యాత్ర మొదలు కానుండటంతోనే భయంతో సీఎం జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని ఆరోపిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •