మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘దర్బార్” సినిమా షూటింగ్ ముగించుకొని సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం “దర్బార్” సినిమాకు సంబంధించి రజనీకాంత్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు గాను నాలుగు బాషలలో నలుగురు సూపర్ స్టార్ లను ఎంపిక చేసి వారి చేత మోషన్ పోస్టర్ విడుదల చేయించాలని ఆలోచిస్తున్నారు.

అందులో భాగంగా బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, తమిళ్ నుంచి కమల్ హాసన్, మలయాళం నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ విడుదల చేయనున్నారు. ఆ బాషలలో సూపర్ స్టార్ ల చేత విడుదల చేయిస్తూ ఇక్కడ చిరంజీవి చేత ఎందుకు చేయించడం లేదని అందరికి ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కారణం ఆయా బాషలలో విడుదలకు చేయబోతున్న హీరోలకు చిరంజీవి ఏమాత్రం తక్కువ కాదు. కానీ ఇక్కడ రజనీకాంత్ చేతనే విడుదల చేయించాలని దర్శకుడు మురుగదాస్ భావించడం వెనుక ఏమైనా కిరికిరి ఉందా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రజనీకాంత్ తో చిరంజీవికి మంచి ర్యాపొ ఉంది. రజనీకాంత్ అడిగితే చిరంజీవి కాదనే పరిస్థితి లేదు. అది కూడా కాకుండా ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్ లోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి షూటింగ్ లు లేకుండా ఖాళీగానే ఉన్నారు. కానీ చిరంజీవిని పక్కన పెట్టి రజనీకాంత్ నే రిలీజ్ చేయడం వెనుక అంతరార్ధం ఏమిటో. మరి కొందరైతే తెలుగులో మోషన్ పోస్టర్ విడుదల చేయడానికి మహేష్ బాబు వస్తాడని వార్తలు వస్తున్నా ప్రస్తుతానికి ఉన్న న్యూస్ అయితే రజనీకాంత్ హైదరాబాద్ లో “దర్బార్” సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు.