గత ఐదేళ్లలో నారా లోకేష్… ఎన్టీఆర్ పట్ల వ్యవహరించిన తీరు ఎప్పటికప్పుడు పార్టీలో కింద స్థాయి క్యాడర్ చర్చించుకుంటూనే ఉంటుంది. వాడికి తెలుగుదేశం పార్టీతో ఏమి సంబంధం వాడికి పార్టీ గేటు తొక్కే అర్హత కూడా లేదు. మనకు ఎన్టీఆర్ అనే సినిమా ఆర్టిస్ట్ లేకపోయినా చంద్రబాబు నాయుడు మరియు నాకున్న అభిమానులతో పార్టీని ముందుకు తీసుకొని వెళ్తామని అనేకసార్లు నారా లోకేష్ పార్టీ నాయకులకు హితోపదేశం చేసేవాడట. అవునవును నారా లోకేష్ కు ఉన్న అభిమాన ఘనం ఎంతమందో తెలుసు కదా?

అసలు ఒకసమయంలో ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుందంటే కృష్ణ, గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మంచి థియేటర్లు దొరకకుండా, ఎన్టీఆర్ సినిమాను తొక్కేసేలా నారా లోకేష్ ఆర్డర్స్ జారీ చేసేవాడని, ఎన్టీఆర్ గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని… ఆ సమయంలోనే ఎన్టీఆర్ కు నా మిత్రులెవరో… శత్రువులెవరనే విషయం స్పష్టంగా తెలిసొచ్చిందని అంటుంటారు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నాయుడు అతడి సుపుత్రుడు వ్యవహరించిన తీరుతోనే ఎన్టీఆర్ పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరారు.

అప్పట్లో నారా లోకేష్ వ్యవహారం నేరుగా మహేష్ బాబు, రాజమౌళి, బోయపాటి లాంటి వారి సినిమాలు విడుదలయ్యేటప్పుడు శుభాకంక్షాలు చెబుతూ ఎన్టీఆర్ సినిమాను లెక్కలేనితనంగా తీసివేయడంతో టీడీపీలో ఉన్న యువ క్యాడర్ చాలా హార్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారం పోయింది… విర్రవీగిన నారా లోకేష్ మంగళగిరి ప్రజల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. రాబోయే రోజులలో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ ఎలా వెలిగిపోతుందనేది పార్టీలో ఉన్న సీనియర్స్ కు ఒక స్పష్టత వస్తుంది. అసలు నారా లోకేష్ ఆధ్వర్యంలో పనిచేయడానికి చాలా మంది నేతలు సిద్ధంగా కూడా లేరు. ఎన్టీఆర్ ను మరొకసారి దగ్గర చేసుకోవడానికి లోకేష్ బాబు ఈమధ్య బాగానే ప్రయత్నాలు చేసాడట. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో నారా లోకేష్ పుట్టినరోజు శుభాకంక్షాలు చెప్పి ఎన్టీఆర్ కు మరింత దగ్గరవ్వాలని ఆతడు చేసిన ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

ఎన్టీఆర్ కు విషయం అర్ధమయ్యింది… అప్పట్లో పిల్లనిచ్చిన మామను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచి చనిపోయేదాకా వేదనకు గురి చేశారో… రాబోయే రోజులలో తనకు అలాంటి గతి పట్టనుందని ఎన్టీఆర్ ముందుగానే ఆలోచించడంతో… 2018 తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తన సొంత అక్క నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నియోజకవర్గం బరిలో చంద్రబాబు నిలబెట్టి ఎన్టీఆర్ కు ఎర వేయాలని చూస్తే అతడు ముందుగానే పసిగట్టి అతడు ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. కారణం వెన్నుపోటు. భయం… అసలు హఠాత్తుగా సుహాసినిని ఎన్నికల బరిలో నిలబెట్టిందే ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించుకోవడానికి… ఎన్టీఆర్ కూడా రాజకీయ నేర్చుకున్నాడు… ఎవడు మనోడు… ఎవడు పగోడని…

ఎన్టీఆర్ ఎన్ని కష్టాలలో ఉన్నా… ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా… అతడి వెనుక ఉండి ముందుండి నడిపించిన ఒకే ఒక్కడు ప్రస్తుత ఏపీ మంత్రి కొడాలి నాని. అందుకే ఒక సందర్భంలో కొడాలి నాని గురించి ఎన్టీఆర్ చెబుతూ నాని అన్నకు ఏమి చేసినా తక్కువేనని…. నాకు ఒక అన్నగా… ఒక స్నేహితుడిగా అని చెబుతూ భావోద్వేగానికి గురైన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. చివరిగా నందమూరి తారక రామారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

సీఎం జగన్ ముమ్మాటికీ దళిత ద్రోహి అనడానికి ఆధారాలివిగో

నిర్మాత సురేష్ బాబుకి మైండ్ సక్రమంగానే పనిచేస్తుంది కదా