ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ రేపటి నుంచి మరొక ఫెస్టివల్ సేల్ తో తన వినియోగదారులను ఆకట్టుకోనుంది. గత నెల 29 నుంచి ఈనెల అక్టోబర్ 4 వరకు నిర్వహించిన సేల్ లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లతో మంత్రముగ్ధులను చేసిన అమెజాన్ సంస్థ ఈరోజు రాత్రి నుంచి ఈనెల 17 వరకు మరొక ఫెస్టివల్ ఆఫర్ తో మొబైల్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్, అమెజాన్ డివైసెస్, స్మార్ట్ టీవీలతో పాటు వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ఇవే కాకుండా మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో వారి బారి ఆఫర్లతో కనువిందు చేయనుంది.

అతి తక్కువ ధరకు ఆపిల్ ఫోన్ లతో పాటు వన్ ప్లస్ 7, శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫోన్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీపావళి వేడుకలకు ముందు నిర్వహించే ఈ సేల్ తో మీ ఇంట దీపావళి పండుగను ముందుగానే సెలెబ్రేట్ చేసుకోండి. ఇక 17వ తేదీతో ఈ సేల్ ముగిసిన తరువాత మరొక వారం రోజులలో స్పెషల్ దీపావళి సేల్ ఉండనే ఉంది.