మొదటి నుంచి అనుకున్నట్లే జరిగేలా ఉంది. రవిశాస్త్రి చేసిన ముంబై లాబీయింగ్ కావచ్చు, భారత్ జట్టు కెప్టెన్ కోహ్లీ మద్దతు కావచ్చు… బీసీసీఐలో ఎప్పటి నుంచో ఉన్న తన పరిచయాలను అడ్డుపెట్టుకొని క్రికెట్ సెలెక్టన్ టీమ్ పై ప్రెజర్ చేయడం కావచ్చు… నిజంగా రవిశాస్త్రి కోచ్ గా ఉండటం వలనే టీమిండియా ఇంతలా మంచి విజయాలు సాధిస్తుందని అనుకోని ఉండవచ్చు… వీటిలో ఏ ఒక్క కారణమైన చివరకు రవిశాస్త్రి వైపే మరో సారి కోచ్ నియమించడానికి మొగ్గు చూపే అవకాశాలు ఉండేలా కనపడుతున్నాయి.

ఇండియన్ క్రికెట్ కోచ్ సెలక్షన్ కోసం ఎంపిక చేసిన ఆరుగురికి ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. వారు టామ్ మూడి, రాబిన్ సింగ్, లాల్ చాంద్ రాజ్ పుత్, ఫీల్ సిమన్స్, మైక్ హాసన్ మరియు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఈ ఆరుగురికి జరుగుతున్న ఇంటర్వూస్ తో ఈ సాయంత్రానికి ఒక కొలిక్కి తీసుకువచ్చి, వీలైతే ఈరోజే కోచ్ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకువచ్చి ప్రకటన చేయవచ్చన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.

రవిశాస్త్రిని తప్పించి మిగతా ఐదుగురు ఎలా మెప్పించి ఆకట్టుకొని టీమిండియా కోచ్ పదవిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. కపిల్ దేవ్ నేతృత్వంలోని కోచ్ ఎంపిక కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో క్రికెట్ అభిమానులలో ఉత్కంఠత నెలకొని ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ టూర్ లో ఇప్పటి వరకు జరిగిన టీ20తో పాటు వన్ డే సిరీస్ ను కూడా వైట్ వాష్ చేయడం కూడా రవిశాస్త్రికి కాస్తో… కూస్తో మేలు చేసే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •