మన దేశంలో మొదటిగా కరోనా వైరస్ కేసులు బయటపడింది కేరళ రాష్ట్రంలోనే… అదే కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి పక్కా ప్రణాళిక రూపొందించడంతో ఇప్పుడు పూర్తిగా కరోనా వైరస్ కేరళ వదిలి పారిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కలను బట్టి తెలుస్తుంది.. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన ఇన్ని రోజుల తరువాత నిన్న, ఈరోజు వరుస రెండు రోజులు ఒక్క కేసు కూడా కేరళ రాష్ట్రంలో నమోదు కాలేదు. దీనితో ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల పట్ల అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాయి.

ఈరోజు కేరళలో 61 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం 34 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కేరళలో ఇప్పటి వరకు 499 కరోనా కేసులు నమోదుకాగా, నలుగురు మాత్రమే చనిపోయారు. కేరళ రాష్ట్రం మొదటి నుంచి కరోనా కట్టడిలో తీసుకుంటున్న చర్యలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్శించడం జరిగింది. అక్కడ వారు అనేక పద్ధతులను కరోనా వైరస్ కోసం ఉపయోగిస్తూ… ఆయుర్వేద వైద్యాన్ని కూడా వాడుతున్నారని చెబుతున్నారు. ఎలాగైతేనేమి మన దేశంలో ముందుగా కరోనా వైరస్ ను ఎక్కడైతే కనుగొన్నారో ఇప్పుడు అక్కడే వైరస్ మహమ్మారిని కంట్రోల్ చేయడం గొప్ప విషయమే.

ఈరోజు ఏపీలో నెలకొన్న పరిస్థితులతో తెలంగాణ సర్కార్ మేల్కొనక తప్పదు

డ్రాగన్ దేశం అందుకే ఆ నిజాన్ని దాచిందట..!

ఈరోజు ఏపీలో నెలకొన్న పరిస్థితులతో తెలంగాణ సర్కార్ మేల్కొనక తప్పదు