టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా ఒకేచోట కలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వేడుకలలోనో అందరు కలసి జరుపుకునే సినిమా ఉత్సవాలలోనే కలవడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు తెలుగు స్టార్ డైరెక్టలందరు కలిసి భోజనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో దర్శకదీరుడు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, సుకుమార్, హరీష్ శంకర్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు ఉన్నారు.

అయితే ఈ ఫోటోను డైరెక్టర్ క్రిష్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ‘జీవితం అనేది అవకాశాల పరంపర. మన జీవితాలు మనం తీసుకునే మరియు మనం తీసుకుని వారి కథలు’ అని పోస్ట్ చేసాడు. కాగా ఈ ఫోటో లేటెస్ట్ ది కాదు. గతంలో దిగిన ఫోటో షేర్ చేసిన క్రిష్.. వాటి తాలూకు జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.

కరోనా భారినపడి 382 మంది డాక్టర్లు మృతి..!

భారత్ లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. 24 గంటల్లోనే దాదాపు లక్ష కేసులు..!