మంచి కథ అంటే మంచి కథే… అది ఒక్కో సారి మనకు అందినట్లే అంది మన నుంచి దూరంగా పారిపోతుంది. దానికి కారణం ఒకే ఒక్కటి… హీరోకు కథపై పట్టు లేకపోవడం… మరొక్కటి హీరోకి కథపై పట్టు ఉన్నా… హీరోను కలవడానికి ఆ రచయితకు అప్పాయింట్మెంట్ దొరకక… హీరోకు సంబంధించిన కోటరీ వ్యక్తులకు కథ చెప్పడం. వారికి ఆ కథ నచ్చకపోవడంతో అది వేరొకరి చేతిలోకి వెళ్తుంది. ఆ తరువాత ఆ సినిమా మరొక హీరో చేస్తే అది హిట్ టాక్ తెచ్చుకుంటే… హీరో నాలుక కరుచుకోవడం తప్ప చేసేదేమి లేదు.

తెలుగు ఇండీస్ట్రీలో ఎంతో మంది కొత్త రచయితలు, కొత్త దర్శకులు… హీరోలు, నిర్మాతల అప్పాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తారు. వారు నిర్మాతకు , హీరోకు కథ వినిపించడానికి వెళితే చివరకు ఆ కోటరీని సంతృప్తి పరచడానికి కథ వినిపించినా వారికీ ఉన్న హాఫ్ నాలెడ్జితో ఆ కథ నచ్చక తిరస్కరిస్తారు. ఇక ఇదే కొఠారికి చెందిన వ్యక్తుల ద్వారా మరో తప్పు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకు పనికిరాని కథ ఆ హీరోకు సంబంధించిన ఆ వ్యక్తులకు నచ్చితే హీరో దగ్గరకు పంపడం హీరో వారి మీద ఉన్న నమ్మకంతో కథ వినే సమయం లేక ఒకే చేయడంతో ఒక్కోసారి రివర్స్ పంచ్ పడుతుంది.

అందుకే హీరోలు కొఠారిని నమ్ముకోకుండా కొత్త రచయితలు, దర్శకుల కోసం నెలలో ఒకటి రెండు రోజులు కథలు వినడానికి సమయం కేటాయిస్తే మంచి కథతో పాటు, మంచి కంటెంట్ ఉన్న దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతారు. ఇలా హీరోలకు ఖాళీ లేదన్న సాకుతో ఇలా కొంత మంది వ్యక్తులను ఏర్పాటుచేసుకుని వారిని నమ్ముకుంటే వారు సంకనాకిన్చడమే కాకుండా… హీరోను నిండా ముంచినా ముంచేస్తారు. అందుకే మంచి కథ కోసం హీరో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇలాంటి మంచి కథలు ఎన్నో మరెన్నో కొత్త రచయితల దగ్గర ఉన్నా వారికి సరైన అప్పాయింట్మెంట్ దొరకకపోవడంతో అసహనంతో ఇండస్ట్రీని వదిలి వెళ్లలేక ఫిల్మ్ నగర్ వీధులలో టీ బంకుల దగ్గర కథ రాసుకున్న పేపర్స్ ను చిత్తు కాగితాలులా పడేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •