టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి నుంచి ఒక సామజిక వర్గం వారిదే పట్టుకొనసాగుతున్న తరుణంలో తన సొంత కాళ్లపై ఎవరి దయ దాక్షణ్యాలపై ఆధారపడకుండా మెగాస్టార్ చిరంజీవి ఎదగడంతో అతడి సామాజికవర్గం కూడా ఎప్పటికప్పుడు పైచేయి సాధించాలని చూసినా అది నెరవేరలేదు. చిరంజీవి సూపర్ డూపర్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో అతడిని తొక్కేయాలని ఎన్ని పధకాలు రచించినా అందరి జిత్తులు చిత్తయ్యాయి. ఇక టాలీవుడ్ మొత్తం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి జై కొడుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడంటే తమకు ఎంత ఇష్టమో వారి లోపల దాచిపెట్టుకోకుండా బయట పెడుతూనే ఉన్నారు.

గత సార్వత్రిక ఎన్నికలలో సీఎం జగన్ అధికారాన్ని కైవసం చేసుకున్న తరువాత కూడా ఒకరిద్దరు హీరోలు జగన్ సర్కార్ కు శుభాకాంక్షలు చెప్పారు తప్ప మిగతా వారంతా మిన్నకుండిపోయారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే అమరావతి భూములతో పాటు దొరికిన చోట దొరికినట్లు భూములు చేజిక్కించుకొని ఫిల్మ్ సిటీల పేరుతో వందల కోట్లు ఆస్తులు కూడపెట్టుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ జగన్ రాకతో అన్ని కలలు ఆవిరైపోవడంతో ఇప్పుడు సీఎం జగన్ పై తమ అక్కసు కొంతమంది లోలోలన అలానే చూపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది పాటు టాలీవుడ్ ప్రముఖులు కలవడానికి కూడా ఇష్టపడలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈమధ్య కాస్త వెనక్కు తగ్గి సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది. మొదటి నుంచి చిరంజీవి ఒక్కడే కాస్త సీఎం జగన్ పట్ల తన వైఖరి ఏమిటో చెబుతూ వస్తున్నారు.

ఇక ఇప్పుడు లాక్ డౌన్ పేరుతో మూసుకుపోయిన థియేటర్లు తెరిచే సమయం ఆసన్నమైంది. వచ్చే అక్టోబర్ 15 తరువాత నుంచి మల్టీ ప్లెక్సులు, థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతినిచ్చింది. మన రెండు రాష్ట్రాలలో కూడా థియేటర్లు తెరవడానికి నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఒకటి రెండు చర్చలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం జగన్ సర్కార్ ఇప్పట్లో థియేటర్లకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదట. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా విజ్రంభిస్తున్న వేళ థియేటర్లకు పర్మిషన్ ఇస్తే కరోనా వైరస్ మరింత ఎక్కువగా సోకే అవకాశముందని ఆలోచిస్తుంది.

దీనితో పాటు టాలీవుడ్ లో జగన్ సర్కార్ ను ఎప్పుడు విమర్శిస్తూ చంద్రబాబు నాయుడుకి భజన చేసే కొన్ని వర్గాల వారికి షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎప్పుడు చంద్రబాబు భజనలో మునిగి తేలే పెద్దలు వారి సినిమాలను విడుదల చేసుకోవడానికి కనీసం 50 శాతం అక్యుపెన్సీతో అయినా థియేటర్లు ఓపెన్ చేయాలని అడుగుతారో లేక తమకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ఇంకా మంకు పట్టుతో ఉంటారో లేక ఎప్పుడు అనుకూల తీర్పులతో జగన్ సర్కార్ కు బొప్పి కట్టించే హైకోర్టుకి వెళ్లి ఏపీలో థియేటర్లు ఓపెన్ చేయడానికి ఆదేశాలివ్వాలని కోరుతారో చూడాలి.

వైసీపీ కేంద్ర బీజేపీలో చేరడానికి సిద్ధమా? కానీ కండిషన్స్ అప్లై