వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు చిరంజీవి మినహా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలెవరు సీఎం జగన్ ను కలవలేదు. దానికి కారణం వారంతా ఒక సామాజిక వర్గానికి చెందినవారని, వారికి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఇష్టం లేదని ఇలా అనేక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ఈరోజు ఎట్టకేలకు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి కలిశారు. గతంలో వైజాగ్ లో హుధుద్ తుఫాను వచ్చిన సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి భారీగా విరాళాలు సేకరించారు. వాటికి సంబంధించి అక్కడ ఇల్లు కోల్పోయిన వారి కోసం 15 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ రావాలని కోరడం జరిగింది. కానీ సీఎం జగన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన వచ్చినట్లు లేదు. సీఎం జగన్ అతని షెడ్యూల్ చూసుకొని కార్యక్రమానికి హాజరవుతారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •