యాపిల్ సంస్థ ప్రతి ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన తన సంస్థకు చెందిన యాపిల్ కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేస్తుంది. ఇందులో ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ కోసం యాపిల్ ఫోన్ ఇష్టపడేవారు వెర్రిగా ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని అనుకుంటుంటారు. ధరలతో సంబంధం లేకుండా ఎంత ధర పెట్టైనా కొనడాకి సిద్ధపడతారు.

కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు యాపిల్ సీఈఓ టీమ్ కుక్ కంపెనీ విడుదల చేయబోయే కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తాడు. ఐఫోన్ కొత్త మోడల్ తో పాటు, గాడ్జెట్స్, ఐపాడ్ ఇలా అనేక రకాలైన ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి. ఐఫోన్ విడుదల చేసినా ఇండియన్ మార్కెట్ లోకి రావడానికి దాదాపుగా రెండు నెలల సమయం పడుతుంది. అమెరికాలో ఒకటి, రెండు రోజులలో అందుబాటులోకి వస్తాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •