రేవు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలు జరపనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం షాపులో ప్రభుత్వం తరుపున పని చేసేవారి రిక్రూట్మెంట్ ముగించారు. రేపటి నుంచి వారంతా ఉద్యోగాలలో చేరవలసి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటాయని ఇప్పటి వరకు భావించగా వాటిని ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచనున్నారని తెలుస్తుంది.

దీనితో మద్యం ప్రియులకు షాక్ అని చెప్పుకోవచ్చు. రాత్రి 10 గంటలైనా మద్యం ప్రియులు షాపుల దగ్గర కిటకిటలాడుతుండేవారు. కానీ 8 గంటల వరకే ఇప్పుడు తెరిచి ఉంచడంతో కొంచెం అలవాటు చేసుకోవలసి ఉంటుంది. జగన్ ప్రభుత్వం చెప్పినట్లు వచ్చే ఐదేళ్లలో మద్యం దుకాణాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మాఫీ చేసి మద్యం రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని చెప్పినట్లు ఏపీ ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తుంది.

ఇప్పటికే ప్రభుత్వాధికారులు చెప్పినట్లు రేపటి నుంచి బీర్లు తాగే వారికి మద్యం దుకాణాలలో చల్లటి బీరు దొరకదన్న షాక్ నుంచి కోలుకోక ముందే మరొక షాక్ ఇవ్వడంతో జగన్ మద్యం లేని రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగేళ్లలో చేసినా చేసి… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడేమో అనిపిస్తుంది.